తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

తాత్కాలిక తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ గా నందాల శ్రీనివాస్ కు భాద్యతలు.

మెదక్ తూప్రాన్ మార్చ్ 6 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
ఇప్పటి వరకు వైస్ చైర్మన్ గా కొనసాగిన నందాల శ్రీనివాస్ కు తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలు అప్పగించిన స్పెషల్ ఎన్నికల అధికారి ఆర్డీవో జయ చంద్రారెడ్డి.
నూతన చైర్మన్ ఎన్నికకు పది రోజుల గడువు ఇస్తూ ఎన్నికల కమిషన్ కు సిఫార్సు చేసిన ఆర్డీవో.
కాగా బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం పై చేతులెత్తి ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా పి.అర్.టి.యు ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ఓటింగ్ తో మెజార్టీ సభ్యులు 11 కు చేరి అవిశ్వాసం నెగ్గింది.
ఈ అవిశ్వాస సమావేశంలో కౌన్సిలర్ లు మామిండ్ల జ్యోతీ కృష్ణ, రామునిగారి శ్రీశైలంగౌడ్, కొడిప్యాక నారాయణ గుప్తా. కుమ్మరి చెలిమేల ప్రియాంక, జిన్నా భగవాన్ రెడ్డి , పల్లెర్ల జ్యోతీ రవీందర్ గుప్త, చింతల రవీందర్ రెడ్డి, భానాపురం రాజు, నందాల శ్రీనివాస్, జమాలపూర్ లక్ష్మీబాయి నర్సోజి లు కలిసి 11మంది అవిశ్వాస ఓటింగ్ లో పాల్గొని చేతులు ఎత్తి ఓటేశారు. దీనితో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో జయ చంద్రా రెడ్డి, ప్రకటించారు. తాత్కాలిక చైర్మన్ గా నందాల శ్రీనివాస్ ను ప్రకటించారు.
మరో పది రోజుల్లో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు కలెక్టర్ కు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.


ఈ కార్యక్రమం లో తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొనొద్దిన్ పాల్గొన్నారు.
అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నేత మహేందర్ రెడ్డి, చిట్కుల మహిపాల్ రెడ్డి, భాగ్యరాజ్, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆకుల శ్రీరాములు, శ్రీహరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, గుండ్రెడ్డిపల్లి కృష్ణారెడ్డి, నాయిని నరసింహా గౌడ్, నర్సంపల్లి జింక మల్లేష్, దుర్గం నాగేష్, ధనరాజ్, ఆర్ఎంపి పి.ఎం.పి.ల అసోసియేషన్ అధ్యక్షుడు అప్సర్, శ్రీధర్ రెడ్డి, యూత్ నాయకులు గౌతమ్ గౌడ్, శ్రీరాములు, నర్సింలు, నాగరాజ్ యాదవ్, ఉమర్, అనిల్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking