తూప్రాన్ షిర్డీ సాయిబాబా ఆలయ ఆవరణ లో ఉచిత మేఘా ఆరోగ్య వైద్య శిబిరం.

30వ తేదీ గురువారం నాడు హై కోర్ట్ సీనియర్ న్యాయవాది డాక్టర్ ఏవి స్వామి ఆధ్వర్యంలో

వికలాంగులకు ట్రై సైకిళ్ళు, వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ

తూప్రాన్, జనవరి, 28 ప్రాజబలం ప్రతినిధి :-

తూప్రాన్ పోలీస్ స్టేషన్ ముందు షిర్డీ సాయిబాబా ఆలయ ఆవరణ లో ఈ నెల 30 గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత మేఘా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఇందులో వికలాంగులకు ట్రై సైకిళ్ళు, వృద్ధులకు చేతి కర్రలు పంపిణీ చేస్తున్నట్లు తూప్రాన్ శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ చైర్మన్, నాచారం ట్రస్ట్ బోర్డు డెరైక్టర్, గజ్వేల్, తూప్రాన్ మున్సిపల్ లీగల్ అడ్వైజర్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సౌత్ ఇండియా డెరైక్టర్,
హై కోర్టు న్యాయవాది డాక్టర్ ఏవి వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్.వి.ఎం హాస్పిటల్ సౌజన్యం తో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర సర్పంచుల పోరం కార్యనిర్వాక అధ్యక్షులు తాజామాజీ సర్పంచ్ చిట్కూల మహిపాల్ రెడ్డి లు హాజరైతున్నారని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, టానిక్ లు అందిస్తామని తెలిపారు. అందంగా గుండే జబ్బు లు ఉన్నవారికి ప్రత్యేక టెస్ట్ లు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి స్కానింగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. వంటిమామిడి దగ్గర లక్ష్మక్కపల్లిలో అర్.వి.ఎం ఆసుపత్రిలో ఈ.హెచ్.ఎస్ సౌకర్యం కలదనీ, నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. మరిన్ని వివరాలకు హాస్పిటల్ మేనేజర్ మంచినీళ్ళ లక్ష్మణ్, గణేష్ రెడ్డి లను సంప్రదించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking