హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వీధి కుక్కల దాడి సంఘటనపై ననిరసన కార్యక్రమం
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి :- కొన్ని రోజుల క్రితం అంబర్పేట్ లో జరిగిన విషాదమైన సంఘటన ప్రదీప్ అనే బాలుడిని కుక్కలు కరిచి చంపిన సంఘటనపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేసినటువంటి బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తితో వారిని వెంటనే పదవి నుంచి తప్పించాలని విజయలక్ష్మి కుక్కలకు మటన్ దొరకక ఇలా చేస్తున్నాయని అనడం ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అంబర్పేటలోని కోరంటి చౌరస్తాలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతారోహిత్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టి వీధి కుక్కలను కూడా తీసుకొచ్చి గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి తీసుకొస్తాము మీరే వీటిని చూసుకోండి అని చెప్పి భారీ నిరసన నిరసన తెలియజేశారు.

అదేవిధంగా నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్తున్న కేటీఆర్ గారు హైదరాబాద్ ను కుక్కల నగరంగా తయారు చేశారని విమర్శించారు గద్వాల్ విజయలక్ష్మి గారు వెంటనే రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించారు.