విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందించాలి

 

మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 23:
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందించాల ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారుల ను ఆదేశించారు.

గురువారం మూడుచింతలపల్లి మండలం హెడ్ క్వార్టర్ , కేశవరం, గ్రామాలను సందర్శించారు. మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ లను స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, గ్రామీణ అభివృద్ధి అధికారి సాంబశివరావు తో కలిసి సందర్శించి పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల చే స్కూల్ యూనిఫాం తయారు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఇప్పటి వరకు ఎంత మేరకు కుట్టడం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. దుస్తుల తయారీ లో నాణ్యతను పాటించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థి,విద్యార్థుల కొరకు అందిస్తున్న యూనిఫామ్ దుస్తులు, సకాలంలో కుట్టించి అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా మూడు చింతలపల్లి లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ను అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు .అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల తో మాట్లాడి పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకుని రావాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ ను, కాంపౌండ్ వాల్ ను పరిశీలించి చిన్న చిన్న మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి స్కూల్స్ లో ఎల్ఈడి బల్బులే వాడాలన్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే పూర్తి స్థాయిలో రిపేరు చేయించి అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాల కంటే దీటుగా తీర్చిదిద్దుతామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వచ్చలదేవి, మెప్మా అధికారి అనిల్ కుమార్, డి పి యం సురేఖ ,అసిస్టెంట్ డైరెక్టర్ లింగానందం, ఏ యం ఓ రవీంద్ర రాజ్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, ఏఈ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సులోచన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking