హైదరాబాద్ మార్చ్ 20 ()బిసి జనగణన పై జాతీయ స్తాయిలో ఆఖిలపక్ష సమావేశం పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు హైదరబాద్ లోని బిజేపి రాష్ట్ర పార్టి కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బిసీల ప్రతినిధుల బృందం కలిసివినతి పత్రం సమర్పించారు.బిసీ డిమాండ్లపై ప్రదాని నరేంద్ర మోదీ గారీని ఓప్పించాలని జాజుల కిషన్ రెడ్డి ని కోరారు.కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి మణిమంజరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బండిగారి రాజు, బాస్కర్ తదితరులు ఉన్నారు.