వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 20:
మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతం కావాలని
జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులును ఆదేశించారు.సోమవారం కలెక్టర్ సమావేశ హాలులో మన ఊరు మనబడి కార్యక్రమం అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్వని తానాజీ వాకాడే, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, సంబంధిత ఇంజనీరింగ్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలనే లక్ష్యం తో మన ఊరు మన బడి ద్వారా అభివృద్ధి పనులని చేపట్టిందన్నారు.ఈ అభివృద్ధి పనులను మండల స్పెషల్ ఆఫీసర్స్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్రతి పాఠశాల విజిట్ చేసి అభివృద్ధి పనుల పురోగతి వివరాలను వాట్సాప్ గ్రూప్ లో ఫోటోలు పోస్ట్ చేయాలని కలెక్టర్ఆదేశించారు.అదేవిధంగా చాలా పాఠశాలల్లో ఖాళీ స్థలం ఉంటుందని ఆ ఖాళీ స్థలాల్లో స్థానికసర్పంచ్ ,ఏఈ ,హెడ్మాస్టర్ సృజనాత్మకంగా ఆలోచించి వారికున్న రిసోర్స్ ఉపయోగించి మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలని చెప్పారు.ప్రతి పాఠశాలలో ఫర్నిచర్ స్టాక్ ఎంట్రీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలని మండల విద్యాశాఖ అధికారులకు తెలిపారు.ప్రతి పాఠశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్ ని వెరిఫై చెయ్యాలని చెప్పారు.26 మోడల్ స్కూల్స్ లలో ఈనెల 31 వరకు పనులున్ని పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు . అదేవిధంగా మిగతా పాఠశాల లో మౌలిక వసతుల పనులను ప్రత్యేక దృష్టి సారించి… పనుల్లో వేగం పెంచినట్లయితే ఏప్రిల్ చివరి దశ వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవచ్చు అని కలెక్టర్ తగు సూచనలు సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.