ఆర్యవైశ్య సంఘం గణపతిని వద్ద వేలం పాటలో లడ్డు దక్కించుకున్న బిఆర్ఎస్ నాయకులు ఉప్పల నరసింహులు గుప్త

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ శ్రీ ఆర్యవైశ్య సంఘం
సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువకుల కోలాటం, మహిళల నృత్యాలు, చిన్నారుల ఆటపాటలతో గణనాధుని నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా , రాష్ట్ర జిల్లా,మండల నాయకులు ముఖ్యఅతిథిగాలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు .అనంతరం నిర్వహించిన లడ్డు వేలంపాటలో
( ఐ వి ఎఫ్) ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నర్సింలు గుప్తా 2,11000వేలకు మహా ప్రసాదాన్ని కైవసం చేసుకున్నాడు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు , యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking