గౌరవ వీ ఆర్ 4 యూ గ్రూప్ అధ్యక్షుల గార్కి నమస్కారం
సహచర గ్రూపు సభ్యుడు చేసిన అభాండాలను వ్రాత పూర్వకంగా జూలై నెల 2023 లో జరిగిన నెలసరి మీటింగ్ లో పిర్యాదు చేసినను త్రోసి పుట్చి, ఈ విషయమై జనరల్ మీటింగ్ లో చర్చిస్తామని తెలిపి, ఆపై ఆగస్ట్ లో జరిగిన మీటింగ్లో తూ తూ మంత్రంగా ఎన్నికలు జరిపి ముఖ్యమైన ఇతర విషయా లన్నింట్టిని ప్రక్కకు త్రోసి మమః అనడం అతిశయోక్తి కాదు, తదుపరి వంద రోజుల తరువాత జరిగిన మొదటి మీటింగ్ 01 డిసెంబర్ 2023న స్నేహితులు కుటుంబీకుల మధ్య గుడి ఆవరణలో సరియైన ఎజెండా లేకుండా ముగించడం జగమెరిగిన సత్యం, ఆ తరువాత రెండు నెలలకు 11 ఫిబ్రవరి 2024 రోజున తలపెట్టిన మీటింగ్ కు డాక్టర్ ద్వారా పంటి ఇంప్లాన్టేషన్ జరుపుకుంటున్న విషయం ఋజువుతో సహా ముందుగా తెలిపి మీటింగ్ కు రాలేనని, కావున తేదీ మార్చమని ప్రాదేయ పడినను ఖాతరు చేయకుండా మీటింగ్ జరిపినారు, 25 ఫిబ్రవరి 2024 రోజున ఎక్జిక్యూటివ్ మీటింగ్ లో జరిగిన అసలైన చర్చలను ప్రక్కత్రోవ పట్టే విధంగా మినిట్స్ వ్రాసినందు వలన, ఆవేదన చెంది జరిగిన వాస్తవాలను సరిచేసి తెలిపినను తిరిగి వ్రాయడానికి ముందుకు రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అన్ని సక్రమముగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగు తున్నవని హితవు పలుకుతూ, పై పెట్చు పెండ్లీల సమయం 17 మార్చ్ 2024న తల పెట్టిన మీటింగ్ ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపినను, చెవిటి వాడికి శంఖ నాదం విన బడనట్టు వ్యవహరిస్తూ, మమ్ములను మీటింగ్ లకు రాకుండా, తదుపరి అధిక ప్రసంగం చేస్తామని నేరారోపణ చేయడం పరిపాటి, ఆగస్ట్ లో కొత్తగా ఎనుకోబడిన కార్యవర్గం లగాయతు ఒక్క ప్రజా ప్రయోజన కార్యములను చేసిన పాపాన పోకుండా, కండ్లు లేని కబోది లాగా మేము చేస్తున్న మంచి పనులను ప్రోత్సహించకుండా, రెండు రోజుల క్రితం మేము కూడా పాల్గొన్న కేవలం రెండే రెండు చలివెంద్రాలను ప్రారంభోత్సవం గావించి, ఆ విషయమై ఒక పత్రికలో వచ్చిన వాఖ్యాలపై వాస్తవంగా వార్త పంపిన వారిపై విరుచుకు పడే బదులు, వారిని నిలదీయకుండ, సహచర వయోజన సభ్యులు తీవ్ర పదజాలం వాడే విధంగా మాపై ఉసిగొల్పుతు, ఈర్ష్యా భావముతో, వెక్కిరింత వాఖ్యానాలను గావిస్టు, పైశాచిక ఆనందాన్ని పొందుతూ, ఒంటెద్దు పోకడలతో స్నేహ బృంధం గ్రూప్ ని కాస్తా సైనిక దళ చర్యల గ్రూప్ గా ప్రత్యామ్యాయం చేయడంలో సఫలిక్రుతులైనారని చెప్పడంలో సందేహం లేదు, మానవ సేవయే మాధవ సేవగా నమ్మే నేను మీ అందరి యొక్క నిరంకుశ ఆలోచనలకు, ప్రతీకార చర్యలకు, విరుద్ధంగా, విలువలేని చోట ఉండి పురోగతిని సాధించ లేమని నమ్మి వీ.ఆర్.4.యూ గ్రూప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తు తదుపరి కార్యచరణలో భాగముగా మేనేజింగ్ ట్రస్టీగా, వీ.ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రజల దప్పికను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి 9 మంచినీటి చలివెంద్రాలను 365 రోజులు కొనసాగిస్తూ, డాక్టర్ల సలహా మేరకు మందులు కూడా ఉచితంగా సరఫరా చేస్తూ ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ, పదవ తరగతిలో ఉన్నతంగా ఉత్తీర్ణత సాధించిన బీద పిల్లల ఉన్నత చదువులు కొనసాగడానికి తగిన సహాయ సహకరాలందిస్తు, తది తర ప్రజా సేవలో మమేకమై అవసరాన్నీ బట్టి సహాయ సహకారాలను అందిస్తూ, ప్రజా సౌకర్యార్థం వీలైనన్ని మంచి పనులు చేస్తూ, మనస్సుకు నచ్చే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రశాంతముగా ప్రజా సేవయే లక్షముగా శేష జీవితం గడపడానికి నిర్ణయించు కున్నానని తెలుపుతూ సెలవు. ధన్యవాదములు, భవదీయుడు అందె లక్ష్మణ్ రావు.