వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి : తెలంగాణా వడ్డెర సంఘం డిమాండ్

హైదరాబాద్ ఫిబ్రవరి 11 ();వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని అందుకు అసంబ్లిలో తీర్మాణం చేయాలని తెలంగాణా వడ్డెర సంఘం డిమాండ్ చేసారు.నేడు వడ్డెర సంఘం నాయకులు వేముల రామకృష్ణ ఆద్వర్యం లో తెలంగాణా రాష్ట్ర వడ్డెర సంగం సమావేశం జరిగింది ఈ సందర్భంగా వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సంచార జీవితం గడిపే వడ్డేరాలను బిసి Aలో చేర్చి తీవ్ర అన్యాయం చేసారని పేర్కొన్నారు.ఎత్తి విషయమై ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు అతి దీనవస్థలో ఉన్న వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.కాని ఇప్పటికైనా ముఖ్యమంత్రి ముఖ్య స్పందించి గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని అందుకు అసంబ్లిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో బిసి సంఘం నాయకులు వేముల రామకృష్ణ కుమ్మర గణేష్ వేముల శ్రీనివాస్ దుండగుల శ్రీనివాస్ వేముల రమేష్ కుమ్మెర శంకర్ మాగని మహేష్ దుండగుల వినోద్ కుమ్మెర నరసింహ దుండగుల బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking