హైదరాబాద్ ఏప్రిల్ 26 (ప్రజాబలం ప్రతినిధి );శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయగానసభలో వివిధ రంగాలలో సేవ చేసిన సంఘ సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పురస్కార్ లను ప్రధానం చేశారు .ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకుడు ఆంధ ఆశ్రమం నిర్వాహకుడు స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ వందనం రాజు కు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల చారి చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పురస్కార్ అవార్డుని ప్రధానం చేశారు. వందనం రాజు ను సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వందనం రాజుగారు మాట్లాడుతూ శిఖరం ఆర్ట్స్ థియేటర్ వారు తన సేవలను గుర్తించి నేను ఎంతో అభిమానించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద స్ఫూర్తి పురస్కార్ అవార్డుని ఇవ్వడం హర్షనీయం అన్నారు. ముందు ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పైన మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శిఖరం ఆర్ట్స్ థియేటర్ కార్యవర్గ సభ్యులు మేధావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు