ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 3
మందమర్రి పట్టణంలోని తవక్కల్ హై స్కూల్ లో సోమవారం వసంత పంచమి పండుగను పురస్కరించుకొని అక్షర అభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఛైర్మెన్ మరియు మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా అక్షరాబ్యాసం చేయించారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పిల్లలూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో వుండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.