తెలంగాణాలో హామీల ఉల్లంఘనలే

 

ఎన్నికల ముందే అభివృద్ధి బాట

_బీఆర్ ఎస్ పై మండిపడ్డ సత్యనారాయణ రావు
_
జగిత్యాల, ఫిబ్రవరి 25: తెలంగాణా లో అధికార బీఆర్ ఎస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రజలను మోసాగిస్తూ పాలన చేస్తోందని ఎన్నికలొస్తేనే సర్కారుకు అభివృద్ధి గుర్తుకొస్తుందని బిజెపి జగిత్యాల జిల్లా అద్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు అన్నారు. శనివారం స్థానిక అన్నపూర్ణ చౌరస్తాలో శక్తి కేంద్రాల ఇంఛార్జీలు ఠాకూర్ పవన్ సింగ్, కొండ్ర రవితేజ ల ఆధ్వర్యంలో ప్రజా గోస బిజెపి భరోసా శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సత్యనారాయణ రావు మాట్లాడుతూ బీఆర్ ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కుటుంబ పాలనకు తెరలేపిందన్నారు. రాష్ట్రంలో ఇలావుంటే జగిత్యాల లో యావర్ రోడ్డు విస్తరణ ఎన్నికల హామీకే పరిమితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను వంచించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకై ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశ పెడితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో అమలుచేయడం లేదన్నారు. పట్టణ రోడ్లన్నీ గుంతల మయమయ్యాయని సత్యనారాయణ రావు ఆరోపించారు. రాష్ట్రంలో స్థానికంగా బోలెడు సమస్యలు ఉన్నాయని ఇప్పుడు ఎన్నికల వేళ ప్రభుత్వం తిరిగి మోసగించేందుకు సిద్ధమయ్యిందన్నారు. స్థానిక నాయకులు పట్టణ సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా ముందుకు రావాలని సత్యనారాయణ రావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యం, అసెంబ్లీ కన్వీనర్ మదన్మోహన్, పడాల తిరుపతి, పొన్నాల తిరుపతిరెడ్డి, వీరభత్తిని అనిల్, రాపర్తి రాజు, ఆముదరాజు, కొక్కిస సత్తయ్య గౌడ్, కాయితి శంకర్, రాజేష్ ముద్దం, ముద్దం రాము, జున్ను రాజేందర్, జున్ను సంతోష్, పోలింగ్ బూత్ అధ్యక్షులు చిట్ల అశోక్, సముద్రాల శ్రీనివాస్, ఆరు ముళ్ళ రాజ్ కుమార్, బాశెట్టి దుబ్బరాజు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking