నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 9 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలను, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం, ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్, బోసుబొమ్మ సెంటర్ ప్రాంతాల్లో, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా పట్టణంలో, కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ మండలాన్ని సందర్శించనున్నారని తెలిపారు. ఆయా మండలాలు, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో జరిగే శుభకార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో పాటు పలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. పలు ప్రయివేటు కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొంటారన్నారు. కావున ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking