ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 09 (ప్రజాబలం) ఖమ్మం 48 సంవత్సరాలుగా కనీస ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగం చేస్తున్న అంగన్ వాడి ఉద్యోగులందరిని బే షరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఖమ్మం జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రారంభించి 48 సంవత్సరాల పూర్తవుతున్న ఇంతవరకు ఆ ఉద్యోగుల బతుకుమారలేదన్నారు. గౌరవ వేతనం పేరుతో అతికొద్ది వేతనం ఇస్తూ ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయని ఆయన విమర్శించారు. 40 సంవత్సరాలు పాటు ఉద్యోగం చేసిన పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక ఉద్యోగ విమరణ తరువాత ప్రశ్నార్థకమైన జీవితంలో వారు ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70000 మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు . కనీస అవసరాలు అయినా వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు అందించడం లేదని ఆయన తెలియజేశారు. స్కీం కేంద్ర ప్రభుత్వాన్నిదైన ఉద్యోగానికి సంబంధించిన విషయం రాష్ట్ర ప్రభుత్వానిది అవటం కారణంగా ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అంగనవాడి సమస్యలపై వినతి పత్రాలు అందించిన స్పందించలేదన్నారు. పశ్చిమబెంగాల్ కేరళ అస్సాం లాంటి రాష్ట్రాలు గ్రాట్యుటీ చెల్లిస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీరి సేవలు ఉపయోగించుకుంటున్న గ్రాట్యుటీ విషయంపై నోరు మెదపడం లేదన్నారు. అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ కనీస వేతనం 26,000 చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాటిటీ చెల్లించాలని, టీచర్స్ కు 10 లక్షల బెనిఫిట్
హెల్పర్స్ కు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని 60 సంవత్సరాలు దాటిన తర్వాత అంగనవాడి ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే వారి రిటైర్మెంట్తో పాటు ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల చెల్లించాలని, ఐసిడిఎస్ బడ్జెట్ను పెంచి బలోపేతం చేసి పక్కాబిల్డింగులను మౌలిక వసతులు కల్పించాలని, పెంచిన ఏరియర్స్అన్ని0టినీ ప్రభుత్వం వీలైనంత త్వరగా చెల్లించాలని తదితర డిమాండ్స్ తో సిఐటియు ఎఐటియుసి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ నుండి అంగనవాడి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఉద్యోగ నాయకులను చర్చలకు పిలిపించి వారి సమస్యల పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రావి శివరామకృష్ణ, రాష్ట్ర నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, జిల్లా ఆఫీస్ బ్యారర్స్ పేరబోయిన మోహనరావు గారపాటి అశోక్, వీరు నాయక్, గుండె పొంగు మల్లేష్* తదితరులు పాల్గొన్నారు.