పాటలు పాడుతూ విఒఎల వినూత్న నిరసన

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మండల కేంద్రమైన ముధోల్ లోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరవదిక చేస్తున్న ఐకేపి విఒఎలు శుక్రవారం పాటలు పాడుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విఓఏల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ రూ 26 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగోన్నతి కల్పించాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరవదిక సమ్మే చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వినూత్న నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కేర్బ, కోశాధికారి శ్రీలత, విఒఎలు సాయినాథ్, సరిత, జ్యోతి, జయశ్రీ, స్వప్న, శోభ, రమాదేవి, పోషట్టి, తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking