మణికొండ కౌన్సిల్ పరిధిలో ప్రజాధనం వృధా.

గండీపేట మండలం ప్రజా బలం ప్రతినిధి 3 డిసెంబర్ 2024
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మణికొండ కౌన్సిల్ గోల్డెన్ టెంపుల్ వద్ద అధికారుల అశ్రద్ద, కాంట్రాక్టుర్ల నిర్లక్ష్య ధోరణి వల్ల వర్షాకాలపు చీకట్లో డ్రైనీజిలో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొట్టుకుపోయిన సంగతి మరువక ముందే అదే ప్రాంతానికి ప్రక్కనే మణికొండ కౌన్సిల్ వార్డ్ 5, వార్డ్ 6, వార్డ్ 17 లకు అతి సమీపాన డ్రైనీజినీ కవర్ చేయడానికి వేసిన సిమెంట్ దిమ్మే విరిగి రోడ్డుతో సహా కృంగి పోవడం అధికారులు గమనించినను మిన్నకుండి తమాశా చూడడం వారి అశ్రద్దకి పరాకాష్టగా అద్దం పడుతుండగా, మళ్లీ జరుగరాని ఉదంతం ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరౌతారని ప్రజలు అల్లాడిపోతున్నారు, పైపెట్చ్చు సదరు కాంట్రాక్టర్ లపై చట్టరీత్యా తగిన చర్యలకు బదులు బోనస్ గా లబ్ది పొందేందుకు మళ్ళీ మళ్ళీ పనులు అప్ప చెప్పడానికి సంసిద్ధంగా అధికారులు ముందుకు రావడం పరిపాటిగా జరుగుతున్న విషయం సాధారణమని, తత్ద్వారా కాంట్రాక్టర్ లకు పబ్బం గడవడo మణికొండ మునిసిపలిటిలో సర్వసాధారణ విషయమని ప్రజలు వాపోతున్నారు. ఇట్టి చర్యల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినను తమ సొమ్మేం పోతుందిలే అనే ధోరణిలో నిమ్మకు నీరెత్తినట్టు మునిసిపల్ అధికారులు స్పందించక పోవడం మరీ విడ్డూరంగా ఉందని, మణికొండలో ఇట్టి పరిస్థితిలతో పాటు ట్రాఫిక్ సమస్యలు ప్రత్యేకించి బుదవారపు అంగడి రోజూ గోల్డెన్ టెంపుల్ కూడలిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్ననూ లెక్క చేయడం లేదనీ ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందని స్థానిక భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు బుద్దోల్ బాబు, మాల్యాద్రి నాయుడు, షేక్ ఆరీఫ్, అందె లక్ష్మణ్ రావు, శ్రీనివాస్ చారి, సురేందర్ రాజు, భాషా, నాగేశ్వర్ రెడ్డి, రాజు తది తరులు భాధతప్త హృదయాలతో తెలుపుతూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అట్టి రోడ్డు విషయమై మొత్తంగా కృంగి పోయి దుర్ఘటన జరుగక ముందే ముందుకు వచ్చి సిమెంట్ దిమ్మేలను తగిన విధముగా సరిచేయాలని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గం తలపెట్టాలని డిమాండ్ చేసిన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking