వీ ఆర్‌ ఫర్‌ యు వయోజన సభ్యుల మీటీంగ్‌

వీ ఆర్‌ ఫర్‌ యు వయోజన సభ్యుల సంస్థ నెలసరి మీటింగ్‌ లో ఇప్పటివరకు 3 చలివేంద్రాలను పర్యవేక్షిస్తూ ఇంకా ఒకటి చిత్రపురిలో, మరొక్కటి 15 వ వార్డ్లో నిర్విహించాలని తీర్మానిస్తు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా 47/ వై ఎమ్‌ నెంబర్‌ బస్‌ మంచిరేవుల, నార్సింగి, పుప్పలగుడా, మనికొండ, హుడా కాలనీ, బంజారా హిల్స్‌ నుండి సికింద్రాబాద్‌ వరకు 32 ట్రిప్పులు ప్రజల సౌకర్యాయార్థం నడిపిస్తున్నారని ఈ విషయమై ప్రజలందరూ సహకరించాలని, ప్రజల వద్దకే ఆర్‌ టీ సీ అనే నినాదంతో వారు ప్రజాసేవకై ముందుకు వచ్చి వీ ఆర్‌ ఫర్‌ యు వయోజన సంస్థ ఆధ్వర్యంలో బుధవారము 26 వ తేదీన ప్రొద్దున 9 గంటలకు ఆంధ్ర బ్యాంక్‌ చొరస్తా లో జరుగబోయే సమావేశానికి ఆర్‌ టీ సీ అధికారులు రీజనల్‌ మేనేజర్‌ వెంకన్న, డివిజనల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణి, మేనేజర్‌ లక్ష్మీ ధర్మా, సీ ఆర్‌ సీ ధర్మేంద్ర, సేఫ్టీ వార్డెన్‌ లక్ష్మణ్‌ ఆదిగా పాల్గొంటారని ఈ సదవకాశాన్ని మణికొండ నివాసులు ఉపయోగించుకొని వారి వారి అనుభవాలను వ్యక్త పరుస్తూ అమూల్యమైన ప్రజా ప్రయోజన సందేశాన్ని అధికారులకు తెలియ పర్చాలని వీ ఆర్‌ ఫర్‌ యు వయోజన సంస్థ అధ్యక్షడు బత్తుల బాపూజీ, కార్యదర్శి డీ ఎస్‌ ఆర్‌ దాస్‌, కోశాధికారి దిలీప్‌ కక్కడ్‌, కే. రామక్రిష్ణ రెడ్డి, అందె లక్ష్మణ్‌ రావు, ప్రదీప్‌ రావు, సాంబశివ రావు, జీ వీ సూర్య నారాయణ, కన్నయ్య, నాగేంద్ర రావు, విజయలక్ష్మి అందరు కలసి ప్రజానీకానికి తెలియజేస్తూ, ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి మనికొండ వాసులు ఆర్‌ టీ సీ అధికారులకు అన్ని విధాల తోడ్పడగలరని ప్రజల తరపున అధికారులకు హామీ ఇవ్వడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking