ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం.

 

తూప్రాన్ మండలాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లో నిలుపుతాం.

ప్రతి విద్యార్థి గురువును గుండెలో పెట్టుకొనేలా తీర్చిదిద్దుతాం.

ఉత్తమ ఫలితాలకోసం మార్పు తెస్తాం.

మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణ.

తూప్రాన్, సెప్టెంబర్, 26
ప్రాజబలం న్యూస్ :-

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తామని, తూప్రాన్ మండలాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లో నిలుపుతాంమని, ప్రతి విద్యార్థి గురువును గుండెలో పెట్టుకొనేలా తీర్చిదిద్దుతామని, ఉత్తమ ఫలితాలకోసం మార్పు తెస్తాం అని తూప్రాన్ మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు మనస్పూర్తిగా ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధతో చొరువ తీసుకొని నాణ్యమైన విద్య తోపాటు సామాజిక స్పృహ కలిగిస్తే అట్టి విద్యార్థి ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకొని బోధించిన గురువును జీవితాంతం గుండెల్లో పెట్టుకొని పూజిస్తారని తెలిపారు. అలాంటి మార్పు వస్తే ఆ విద్యార్థి తోపాటు వారి కుటుంబం సైతం ఎదిగి ప్రయోజనం పొందుతుందని అన్నారు. తెలంగాణలో ఖాలీగా ఉన్న ఎం.ఈ.ఓ పోస్ట్ లను పదోన్నతులు కల్పించి భర్తీ చేశారని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో సాధన చేసే ప్రయత్నం కొనసాగిస్తే మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు తాను చదువు చెప్తే విజ్ఞానం సముపార్జించి ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత అట్టి ఉపాధ్యాయున్ని జ్ఞాపకం ఉంచుకుంటే వారి జన్మ ధన్యమని అన్నారు. విద్యార్థుల ఆర్థిక స్థితిగతులు బాగలేక ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని అలాంటి వారికి ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్య, మానసిక పరివర్తన మార్పు తెస్తే తూప్రాన్ మండలాన్ని జిల్లా లోని కాకుండా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని వారి తల్లి,తండ్రి, కుటుంబం పూర్తి బాధ్యతను ఉపాధ్యాయుడు తీసుకొని విద్యా భోధన చేసి ఆదర్శంగా నిలువాలని ఉద్బోధించారు. మండల ఎఫ్.ఎల్. ఎన్ నోడల్ అధికారిగా గత ఏడాది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి జిల్లాలో మొదటి స్థానం లో నిలిపినట్లు తెలిపారు. తూప్రాన్ హైస్కూల్ లో ప్రభుత్వం ద్వార ఐదు మంది విద్యార్థులకు సంవత్సరానికి 12 వేల చొప్పున ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్ షిప్ మంజూరు చేయించినట్లు వివరించారు. తూప్రాన్ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్ లలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సవరించి మార్పు తీసుకవస్తా అని అన్నారు. ఉపాధ్యాయుని చిన్న చొరవతో విద్యార్థి జీవితం మారడం తోపాటు అతని కుటుంబం లో సముల మార్పు వచ్చి ఉపాధ్యాయులను జ్ఞాపకం ఉంచుకుంటారని అన్నారు. ఒక ఉపాధ్యాయునికి అంతకంటే ఎక్కువ తృప్తి ఎక్కడా లభించదని, డబ్బు ఇస్తే ఉండదని కేవలం విద్యార్థులు అందించే ఆప్యాయత, అనురాగం, ప్రేమ శాశ్వతంగా నిలిచిపోయి చరిత్రలో ఉంటుందని అన్నారు. తూప్రాన్ మండలంలో ఏదైనా పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. మంచిగా ఉంటే నా వరకు తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు చంద్రారెడ్డి,పట్లూరి లక్ష్మణ్ పటేల్ , డాటా ఎంట్రీ ఆపరేటర్ స్వామి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking