సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా అప్పీలు చేస్తాం

 

బీజేపీ కి అంబేద్కర్ వాదులు అంటే కోపమేందుకు

హలో మాల చలో ఢిల్లీ 11,12 నిరసన తెలియ చేస్తాం

మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జూపక సుధీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంనకు ముఖ్య అతిధిగా జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి హాజరు అయి సుప్రీం కోర్టు జడ్జిలు ఎస్ సి వర్గీకరణ తీర్పు లో తప్పు చేశారు అన్నారు మేము ప్రాణాలు అర్పిస్తాం ఎస్ సి వర్గీకరణ అడ్డుకుంటామని హెచ్చరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలను హెచ్చరించారు ఎస్ సి వర్గీకరణ విషయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పునరాలోచించు కోవాలని అన్నారు సుప్రీం కోర్టు జడ్జిలు 341 అర్థకల్ను మార్చరన్నారు చిన్నయ్య తీర్పును తప్పు పట్టిన జడ్జిలు బీజేపీ అనుబంధం గా ఉన్నవాళ్లే అన్నారు ఎస్ సి ఎస్ టీ ల జనాభా ప్రత్తిపాధికాన రిజర్వేషన్ పెంచా మంటే విభజించి పాలించడం బీజేపీ కుట్ర అన్నారు హలో మాల చలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ చేసారు 11,12 తేదీలలో ఎస్ సి వర్గీకరణ ను అడ్డు కోవడానికి వేలాదిగా మాలలు తరలి రావాలి అని పిలుపు ఇచ్చారు ఈ సమావేశం లో జాతీయ కార్యదర్శి కాసార్ల యాదగిరి సినియర్ నాయకులు సబ్భాని రాజానర్సు రాష్ట్ర కార్యదర్శి లు దేవరపల్లి మధుబాబు గద్దల తిరుపతి,బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ఎరుకల శ్రీనివాసు మంచిర్యాల జిల్లా రెడ్డి రమేష్ జిల్లా కోశాదికారి కారం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking