అర్హులైన అభ్యర్థులకు రాజీవ్ యువ వికాసం అందేలా చూస్తాం.

 

వేములవాడ రూరల్ ఎంపీడీవో శ్రీనివాస్.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), వేములవాడ అర్బన్ మరియు రూరల్ మండల పరిషత్ కార్యాలయాలలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రోజున అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో చీర్లవంచ గ్రామానికి చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎదురు గట్ల, చెక్కపల్లి గ్రామాల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండల పరిషత్ ఎంపీడీవో కే. శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా అమలు చేస్తున్న మని తెలిపారు. నిరుపేదలైన అభ్యర్థులను గుర్తించి వారికి రాజీవ్ యువ వికాస్ పథకం అందేలా చూస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking