అవసరమైనచోట కొత్త బూతులను ఏర్పాటు చేస్తాం

 

అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతం

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 21:
ఎన్నికల సమయంలోనే కాకుండా క్రమం తప్పకుండా సమావేశమై అన్నీరాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలను, సూచనలను పరిగణలోనికి తీసుకోని భారత ఎన్నికల కమీషన్ కు పంపుతామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు/జిల్లా ఎన్నికల అధికారి గౌతం తెలిపారు.
శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టరు గౌతం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో జనాభా పెరుగుతున్నందున ఓటర్లు కూడా పెరగడం జరుగుతుందని అందుకనుగుణంగా బూత్ లెవెల్ ఏజెన్సీలను నియమించాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. సరళీకృత ఓటరు జాబితాలను అవసరమైన మేరకు ఎప్పటికపప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ అట్టి మార్పుల వివరాలను ను బిఎల్ ఎలు ఓటర్లకు తెలియజేయాలని తెలిపారు. సాధారణ అభ్యర్థనలు ఏమైన ఉంటే కమీషన్ దృష్టికి తీసుకువళ్లడం జరుగుతుందన్నారు. బూతులను షిప్టు చేయడం కష్టమని, అవసరమైన మేరకు కొత్త పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టరు తెలిపారు. ఒకే కుటుంబ సభ్యులు వేరు వేరు బూతులలో ఓటరు నమోదు ఉన్నట్లయితే వారు ఫామ్ -8 లో బూతు మార్పుకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.పార్టీ ప్రతినిధుల సూచనల మేరకు తండాలలో పరిశీలించి అవసరమైన చోట కొత్త బూతులను ఏర్పాటు చేస్తామని కలెక్టరు తెలిపారు. ఇవన్ని చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహాకారం అందించాలని పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా క్లియర్ చేసుకొవాలని పార్టీ ప్రతినిధులకు కలెక్టరు సూచించారు. ఏవైనా సమస్యలున్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ,రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking