– కలిసి కట్టుగా పని చేస్తాం ములుగు జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తాం

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా జులై 15 :

 

– మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని కన్న తల్లీ తండ్రులను మనం పుట్టిన ఊరును మర్చిపోవద్దు

– ములుగు జిల్లాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం

– ఎంపీ పొరిక బలరాం నాయక్ బోల శంకరుడు

– రాజకీయాలకు అతీతంగా పని చేసే మంచి మనస్సు ఉన్న నాయకుడు

– ఎంపీ పొరిక బలరాం నాయక్ గారి చలువ తోనే గిరిజన యూనివర్సిటీ ములుగుకు 100 పడకల హాస్పటల్ ఏటూరు నాగారం ముళ్ళకట్ట బ్రిడ్జి

– ఎంపీ పొరిక బలరాం నాయక్ గారి ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ఆదివారం రోజు ములుగు మండలం లోని ఎంపీ బలరాం నాయక్ గారి స్వగ్రామం లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరాలుగా అధికారంలో లేకపోయిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన మొక్క వన్నె దీక్షతో కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకున్న నాయకుడు పొరిక బలరాం నాయక్ గారని ప్రజల ఆశీస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలువడం నిజంగా సంతోషకరమని మనసుల్లో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేని బోలా శంకరుడు మన బలరాముడు అని బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి గా ఉన్నపుడే ములుగు కు 100 పడకల ఆసుపత్రి జాతీయ రహదారి వెడల్పు కస్తూర్బా మోడల్ స్కూల్ లు సబ్ స్టేషన్ లు ఏటూరు నాగారం ముళ్లకట్ట బ్రిడ్జి నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు అని ఇప్పుడు రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రములో నేను మంత్రిగా కేంద్రములో ఎంపీ గా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలఅధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking