ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఎక్కడ మహిళలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువవుతారని మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సమాజం సరికాదన్న ఆమె, ఒకనాడు మాతృస్వామిక సమాజం నుంచి నెమ్మదిగా పితృస్వామ్యం దిశగా పరిస్థితులు మారాయన్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తిని అందిపుచ్చుకొని అతివలంతా ఆర్థికంగా బలంగా మారడంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ ఉన్నత స్థానాలకు చేరాలని మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు తెలుపుతూ మీ దనసరి అనసూయ సీతక్కరాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు