ఎవరిని ఎవరు మోసం చేశారు

 

ఒక పెద్దాయన డబ్బు మద్యం సంచులతో ప్రజలను  మోసం చేసేందుకు వస్తున్నాడు జాగ్రత్త

కందాలను గెలిపించుకోండి మీకు అండగా ఉంటాడు  సీఎం కేసీఆర్

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం డబ్బు మదంతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నా బహురూపుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా జరిగిన భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు ఈసందర్భంగా ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే ఖమ్మంను అనుకుని ఉన్న పాలేరు ను ఖమ్మంకు దీటుగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఉపేందర్ రెడ్డి అడిగిన విధంగా నియోజకవర్గాన్ని మొత్తంగా దళితబంధు అమలు చేసే భాద్యత నాదని అన్నారు ఒకప్పుడు కరువుకు నిలయమైన పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజక్టు ద్వారా సాగు ,తాగునీరు అందించిన ఘనత బీఆర్ యస్ దే అన్నారు భక్త రామదాసు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా నాడు డీజీపీ గా ఉన్న మహేందర్ రెడ్డి సైతం తాను వస్తానని అడిగారని ఎందుకు అని అడిగితె కరువు ప్రాంతమైన మా ప్రాంతానికి నీళ్లు రావడం చూడాలని అన్నారు డబ్బు మదంతో ఒకాయన ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నారు కాంట్రాక్టులద్వారా వచ్చిన డబ్బులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు బహురపుగాళ్లతో జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించారు పొరపాటుగా వాళ్ళను నమ్మి ఓట్లు వేస్తె రైతుబంధు కు రాం..రాం దళితబంధు కు జై బీమ్ , కరంటు కథ కంచికేనని తస్మాత్ జాగ్రత అన్నారు . గత రెండు పర్యాయాలు ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వచ్చింది అయినా బీఆర్ యస్ అధికారంలోకి వచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు

ఎవరు ఎవరిని మోసం చేశారు

మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, పాలేరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖమ్మంలో నువ్వు పార్టీకి చేసింది గుండు సున్నా పైగా నేను మోసం చేశాను అని చెప్పు కుంటున్నాడు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking