మీ గ్రామంలో అర్హులను మీరే గుర్తించాలి

ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 26:
మీ గ్రామంలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది మీకంటే బాగా ఎవరికి తెలియదు, అందుకే గ్రామ సభలు ఏర్పాటు చేసి అనర్హులను తొలగించి, అర్హులను గుర్తించే బాధ్యత గ్రామస్తులైన మీ పైనే ఉన్నదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు.
ఆదివారం ఘట్కేసర్ మండలంలోని ఘణపూర్ గ్రామంలో ప్రభుత్వం అందించే ప్లాగ్ షిప్ పథకాల లబ్దిదారులకు అందించే కార్యక్రమానికి ఫ్లాగ్ షిప్ స్కీమ్స్ స్పెషల్ ఆఫీసర్ శశాంక, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావును సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడుతూ మీ గ్రామంలో అర్హులను మీరే గుర్తించాలని అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, అనర్హులను గుర్తించి అధికారులకు తెలియజేయాలని గ్రామస్తులను కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పాలన లో మీరు భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా, ఇందరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అయిన సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు.ఈ విడతలో పథకాలురాని వారు నిరాశ చెందవద్దని, తరువాత కూడా అర్హులైన వారు ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని, ఆ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకొని అందులో కూడా అర్హులైన వారికి తప్పకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేసారు. అర్హులైన వారికి లబ్ది చేకూర్చే వరకు అధికారులు పనిచేస్తారని తెలిపారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా 4 ప్లాగ్ షిప్ స్కీమ్స్ మంజూరు ఇవ్వడంఈరోజు నుండి ప్రారంభమైందని అన్నారు. ఘణపూర్ గ్రామంలోఈరోజురైతు భరోసా 117 మందికి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 17 మందికి ఇందిరమ్మ ఇళ్లు 117 మందికి,రేషన్ కార్డులు 176 మందికి మొత్తం 427 మంది అర్హులైన లబ్దిదారులకుఈ మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయఅధికారి చంద్రకళ, జిల్లా పౌర సరఫరాల అధికారి సుగుణబాయి, డిఆర్డిఓ సాంబశివరావు, జిల్లా పరిశ్రమల అధికారి ప్రశాంత్, హౌజింగ్ఈఈ రమణ మూర్తి, ఘట్కేసర్ తహాసీల్దారు, ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా లోని మేడ్చెల్ మండలంలో సోమారం గ్రామంలో, శామీర్ పేట మండలంలో పొన్నాల, కీసర మండలంలో బోగారం, మూడుచింతలపల్లిలో కేశవరం గ్రామాలలోఈరోజు 4 ప్లాగ్ షిప్ పథకాలను ప్రారంభంచారు. కీసర మండలంలో బోగారం లో మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడి అర్హులకు మంజూరు పత్రాలు అందజేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking