మెదక్ జూన్ 26 ప్రజాబలం న్యూస్ :-
జిల్లాను,రాష్ట్రాన్ని,
మన దేశాన్ని అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యకరమైన జీవసమాజాన్నిఅభివృద్ధి లోనికి తీసుకురావాలి జిల్లా జడ్జి,చైర్ పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద,
మత్తు పదార్థాల విక్రయం, రవాణా చేయడం చట్ట వ్యతిరేకం: ఎస్పీ
బాలస్వామి
విద్యార్థులు,యువత మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీ
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు వయోవృద్దులు, దివ్యాన్గుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా కేంద్రంలోని మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర నుండి రాందాస్ చౌరస్తా వరకు. ర్యాలీ నిర్వహణ. జిల్లా జడ్జి,చైర్ పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద,జిల్లా ఎస్పీ బాలస్వామి అడిషనల్ ఎస్పీ మహేందర్,జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ,జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్, జిల్లా అధికారులు, తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం రాందాస్ చౌరస్తా కూడలిలో మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం మంభోజిపల్లి లోని గీతా స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి,చైర్ పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లక్ష్మీ శారద మాట్లాడుతూ
మన మెదక్ జిల్లాను,రాష్ట్రాన్ని,మన దేశాన్ని అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యకరమైన జీవసమాజాన్నిఅభివృద్ధి లోనికి తీసుకురావాలనీ
ఏ మందు అయితే మన శరీరాన్ని మనసును నిర్వీర్యం చేస్తుందో హింసకు పురిగొలుపుతుందో అలాంటి దాన్ని మాదకద్రవ్యం కిందే భావించాలని చెప్పారు.
గంజాయి,లోకల్ గాఅందుబాటులో ఉంటుందని ఆర్థిక తారతమ్యం లేకుండాపేద ధనిక అనే భేదం లేకుండా క్షణికమైన ఆనందం కోసం ఈ మత్తు పదార్థాలను ఉపయోగించి
మీ జీవితం మీ తరాల జీవితం కూడా
నాశనం చేసుకుంటున్నారని ఒక్కసారి పునరాలోచన చేయాలని
చెప్పారు.
మాదకద్రవ్యాల నివారణకు చట్టాలు కఠినంగా ఉన్నాయని నార్కోటిక్ డ్రగ్స్ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు
మీకుఅందుబాటులో తెలిసి ఎవరైనా మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న రవాణా చేస్తున్న కలిగి ఉన్న అమ్ముతున్న వాటి నిర్మూలనకు మీ వంతు కర్తవ్యం గా మాకు సమాచారం తెలియజేయాలని,వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.
మెదక్ జిల్లాలో కల్లు బాగా అమ్ముతున్నారని వాటిలో కూడా మత్తు పదార్థాలు కలుపుతున్నారని
వీటివల్ల కూడా చాలా ప్రమాదకరమని వ్యసనపరులను గుర్తించాలన్నారు.
గంజాయి అయితే విచ్చలవిడిగా పంటలు పండిస్తున్నారని మీరందరూ రకరకాల గ్రామీణ ప్రాంత వాసుల నుండి వచ్చారు కాబట్టి మీ అందరికీ
ఎక్కడ గంజాయి పడుతుందో తెలిసి
ఉంటుందని మీ కుటుంబంలో ఎవరైనా డ్రగ్స్ బానిసలై ఉంటేఅలాంటి వివరాలను మాకు తెలియజేసి వారిని విముక్తులు చేయడంలో సైనికులవలె భారత దేశ పౌరులుగా సాటి మనిషిని మత్తుకు బానిసైపోకుండా రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు అలవాటు పడి విలువైన నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు. మాదక ద్రవ్యాలు అలవాటు వల్ల అవయవాలు దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతిని కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు మానసికంగా కృంగిపోతానికి, నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఆరోగ్యం క్షిణించి పోతుందని తెలిపారు. జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలన్నారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటిస్తూ చక్కగా చదువుకొని దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు.
తల్లిదండ్రులు సైతం తమ పిల్లల వ్యవహార శైలిని పరిశీలిస్తూ ఉండాలని మత్తు పదార్థాలు అలవాటు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వం మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని విద్యార్థి దశ నుంచి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 26 వ తేదీన అంతర్జాతీయ
మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియాగం అలవాటు ఉన్న వ్యక్తుల సమాచారం పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖల సిబ్బందికి తెలియ చేయాలని సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యముగా ఉంచుతామని తెలిపారు.
ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ
మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని యువత, విద్యార్థులు గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల మానసిక స్థితి సరిగా లేక నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాలలో కొందరు వ్యక్తులు డబ్బు సంపాదన ధ్యేయంగా యువతకు మత్తుపదార్థాలు చాక్లెట్ల తదితర తినుబందారాల రూపంలో అలవాటు చేస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
పోలీస్ శాఖ తరపున నిత్యం గంజాయి ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులు విక్రయించే వ్యక్తులపై నిత్యం ఏదో ఒకచోట కేసులు నమోదు చేస్తూనే ఉన్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు యువత గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తే జరిగే అనర్ధాలుపై అవగాహన కలిగి వుండాలనీ ఎక్కడైన గంజాయి, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు గాని విక్రయించే వ్యక్తులు వివరాలు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ,విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాందాస్ చౌరస్తాలో డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సామాజమే లక్ష్యంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో గీత సంస్థల డైరెక్టర్ రామాంజనేయులు , జిల్లా అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.