ఆర్ ఎం పి చికిత్స పొందుతూ మృతి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఆంద్రబోర్ అశోక హోటల్ ముందు ఈ నెల 23వ తారీకున బైక్ ఢీకొట్టడంతో గాయపడ్డ గోల్లే రాజాం అనే 50 సంవత్సరాల వ్యక్తి చికిత్స పొందుతూ కరీంనగర్ దవాఖానలో మృతి చెందాడు. మృతుడు జన్నారం మండలం చేరకగూడెం నివాసి. ఆర్ ఎం పి గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం దోనబండ వెళ్లి వస్తుండగా లక్షెట్టిపేట అశోక హోటల్ ముందు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా కరీంనగర్ చౌరస్తా నుండి ఉత్కూర్ చౌరస్తా వైపు వస్తున్న బైక్ ఢీకొట్టడంతో తలకు గాయం కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 6.51 నిమిషాలకు చనిపోయాడు. మృతుని బార్య గోల్లే లక్ష్మీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.లక్షెట్టిపేట ఎ ఎస్సై వై రామయ్య తెలుపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking