సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 7 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ 30 డివిజన్ సుందరయ్య నగర్ లో సిసి రోడ్లు వేయాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఖమ్మం 3 టౌన్ లో 30 డివిజన్ సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం సుగ్గల హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ గొళ్ళపాడు ఛానల్ కాలువ పనులు సందర్భంగా ఏదైతే పనులు మొదలుపెట్టారు ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు ఆ పనులు పూర్తికానందున రోడ్లన్నీ ఖరాబై గుంతల గుంతలుగా ఏర్పడి కాలువలు పూర్తికానందున వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ రోడ్లమీదకి ఇళ్లల్లోకి వస్తున్నాయి పార్కుకు చుట్టుపక్కల మంచి కంటి రామ్ కిషన్ రావు, పార్కు పక్కన మరియు సుందరయ్య పార్క్ పక్కన మరియు అభినవ్ స్కూల్ రోడ్డులో రోడ్లన్నీ ఖరాబై పోయినాయి గుంతల గుంతలు గా ఏర్పడి నడవడానికి కూడా ద్విచక్ర వాహనాల కూడా చాలా ఇబ్బందికరంగా తయారయింది కావున గొళ్ళపాడు ఛానల్ కాలువ పనులు తొందరగా పూర్తి చేసి సీసీ రోడ్లను నిర్మించాలని ఆయన కోరారు అలాగే వర్షాలకు మున్నేరు వరద పొంగి ఇండ్లలోకి నీరు చేరి ఫర్నిచర్ వస్తువులు కరాబ్ అయిపోయినాయి అలాంటివారిని గుర్తించి సర్వే చేసి వారికి తక్షణ ఆర్థిక సహకారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాకుండా ఆ ఏరియాలో బ్లీచింగ్ మరియు దోమల మందును కొట్టించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శ వర్గ సభ్యులు షేక్ హిమామ్, శాఖ కార్యదర్శి పెద్దోజు ఉపేంద్ర చారి, రాఘవయ్య, వేముల రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.