టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం జన గణన తో పాటు కుల గణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయం
దేశ చరిత్రలో మొదటిసారిగా కుల గణన నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ
కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది
జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనలో పేర్కొన్నారు. కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా కుల గణన నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాస్త్రీయంగా కులగణనను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మహేష్ గౌడ్. కులగణన లెక్కల ఆధారంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన కులగణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు దారిలోకి రావడం శుభ పరిణామని..ప్రజాభీష్టానికి లొంగి కులగణనను చేపట్టాలని నిర్ణయంచిన కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాలని టీపిసిసి చీఫ్ డిమాండ్ చేశారు.