ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, నవంబర్ జనవరి 2 :
ఆది జాంబవ సంఘం నూతన అధ్యక్షుడిగా కంబాల రాజనర్సు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు ఎన్నికైన కంబాల రాజనర్సు గురువారం మాజీ విప్ చెన్నూరు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలును తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంబాల రాజనర్సును మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీదునూరి శంకర్, దాసరి రాజనర్సు తుంగపిండి శ్రీనివాస్, ఇరుగురాల వెంకటి గసిగంటి మల్లయ్య, కే. శంకర్, ఏ కరుణాకర్, శ్యామ్, నెరువట్ల లక్ష్మణ్ బచ్చల లక్ష్మయ్య, రాజేశం, బండ సారయ్య రాజయ్య, కల్వల సురేష్ లు ఉన్నారు.