అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలు చేయాలి
స్టేషన్ బేల్ వ్యవస్తను రద్దు చేయాలి
రాజ్యసభ సబ్యులు కృష్ణయ్య
హైదరాబాద్ మే 27 న్యాయవ్యవత్సకు స్వయం ప్రతిపత్తి ఉన్నపుడే పేదలకు న్యాయం జరుగుతుందని రాజ్యసభ సబ్యులు కృష్ణయ్య అన్నారు.ట్రస్టర్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏ. రాజారావు గారి అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలుకోసం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విచ్చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో మరియు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని డిమాండ్ చేసారు. సామాజిక న్యాయసాధనకై బిసి అడ్వకేట్ చేస్తున్న పోరాటాలు న్యాయ సమ్మతమైనవని సామాజిక న్యాయసాధనకై పోరాటం చేస్తున్న న్యాయవాదులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.హైకోర్టు,సుప్రీంకోర్టు జడ్జిల నియమకాలలో బిసి/ఎస్సి/ఎస్టి లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కోటా ప్రవేశపెట్టాలని, అలాగే జూనియర్ బిసి అడ్వకేట్ కు నెలకు 20 వేల స్టైఫండ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చాలిచాలని సంపాదనతో జీవితాలను వెల్ల దీసే ప్రతి అడ్వకేట్ కు 250 గజాల ప్రభుత్వ స్థలం, ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అడ్వకేట్స్ అందరికీ, కుటుంబ సభ్యులతో ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని కోరారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రము లో న్యాయవాదుల పై దాడులు,హత్యలు పెరిగి పోతున్నయని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేసారు.బయట దాడులతో పాటి ఏకంగా కోర్ట్ ఆవరనలోనే లాయర్లపై దాడులు జరుగటం శోచనీయమన్నారు.చట్టం ఉన్నత వర్గాలకు చుట్తంగా మారిందని ఆరోపించారు. గతం తో పోల్చితే నేటి రాజకీయాలు బ్రస్టు పట్టి పోయాయన్నారు.రౌడీలు,గుండాలు,భూకబ్జా దారులు,రియలేస్టేట్ మాఫియా రాజ్యమేలుతుందని,వీరిని అరికట్టాలంటే మేధావులు, లాయర్లు రాజకీయాల్లోకి రావాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారుస్టేషన్ బేల్ ల మూలంగా హత్యలు, దోపిడిలు, గుడాలు యదేచ్చగా గంటలో బయటికి వస్తున్నారని,వెంటనే స్టేషన్ బేల్ వ్యవస్తను రద్దు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేసారు. దేశం మొత్తానికి అడ్వకేట్ యొక్క రక్షణ మరియు సంక్షేమ కార్యక్రమాల విషయమై అసోసియేషన్ నుండి ఒక డ్రాప్ చేస్తే రాజ్యసభలో చర్చిస్తామన్నారు. న్యాయవాదుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ 60 సంవత్సరాలు నిండిన వద్ద న్యాయవాదులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు 41 సిఆర్పిసి కేంద్ర పోలీస్ స్టేషన్ క్రింద పోలీస్ స్టేషన్ ఇవ్వడాన్ని తవ్వుతూ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్స్ మాదిరిగా లాయర్లకు కుడా రక్షణ చట్టం తీసుక రావాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు ఎ.రాజారావు,ఉపాధ్యక్షులు జి. శివ కుమార్,ప్రధాన కార్యదర్శి.సురేందర్, కోశాధికారి నరేష్,కార్యదర్శి సంతోష్, నిరజ్‌టాకూర్,ఆర్గనైజేషన్ సెక్రటరీ సంపత్,ఉమారమేష్, శ్రీనివాస్ , లక్ష్మణ్, విశ్వనాథ్ , బి మహేందర్, నాగార్జున ప్రమిల కల్పన .నిరోష, శరత్ సింఘ్టాకూర్, సుధాకర్ రాజలింగం, అశోక్,వేముల రామకృష్ణ,జక్కుల వంశీ,పోచన్న,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.