పొంగులేటి ప్రధాని అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈనెల 8న కూసుమంచి లో జరిగే పాలేరు నియోజకవర్గం స్థాయి యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ అధికార అహంకారానికి, ధర్మం మానవత్వానికి జరుగుతున్న ఈ యుద్ధంలో చివరికి మంచి మనసున్న వ్యక్తి మానవత్వం ఉన్న వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దే విషయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈనాడు అధికార పార్టీ పెట్టిన ప్రతి పథకము కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం నుంచి కాపీ కొట్టిందే అని, ఆ పథకాన్ని అమలు చేయకపోతే ఎక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారోనని భయం చేత వాటిని అమలు చేస్తున్నామంటూ నాన్చుకుంటూ చివరికి నిర్వీర్యం చేశారు. మళ్లీ ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మల్లిబాబు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెండ వెంకటేష్ ,దూబన రాము, బట్టు మహేష్ మారుతి నరేష్, బొల్లం ఉపేందర్ బొల్లినేని నాగయ్య,పి. రాంబాబు, చప్పిడి తిరుపతిరావు రేఖం లింగయ్య, గోనె రవి, వట్టె ఉపేందర్, గోళ్ళ వీరభద్రం,బొల్లిని నవీన్ తదితరులు పాల్గొన్నారు