పెద్దపల్లి ప్రజాబలం మార్చి 4÷
జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశానుసారం పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వింజమూరు సురేష్ ను శనివారం నియామకం చేశారు. బహుజన ఉద్యమంలో సురేష్ సేవలను ఉపయోగించుకునేందుకు ఈ బాధ్యతలు అప్పజెప్పినట్లు జిల్లా అధ్యక్షుడు తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు. తనను నియమించినందుకు ఆర్ కృష్ణయ్యకు జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణకు ప్రధాన కార్యదర్శి పున్నం ప్రసాద్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
నాకు ఇచ్చిన బాధ్యతను నీతి నిబద్ధతతో పనిచేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకుంటే రామగుండం నియోజకవర్గం లో బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ రామగుండం మున్సిపాలిటీ ముఖ్య నాయకులు సట్ల భాస్కర్, నామిని గణేష్, బొద్దుల అరుణ, కోటేశ్వర్ రాజయ్యలు ఉన్నారు