బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏమి చేస్తున్నాడు

తరుచుగా కూలిపోతున్న గోశా మహల్‌ నాలా స్లాబ్‌ పనుల పై సమగ్ర విచారణ చేపట్టాలి.
– సీపీఎం రాష్ట్ర నేత ఎం డి అబ్బాస్‌
నాలా దగ్గర నిరసన వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: గోష మహల్‌ చాక్నావాడి ప్రాంతం లో వెడల్పైన నాలా పై నిర్మిస్తున్న స్లాబ్‌ లు తరుచుగా కూలిపోతున్నాయని ప్రజల ప్రాణాపాయ స్థితికి గురయ్యే ప్రమాదముందని సీపీఎం హైదరబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి ఎం డి అబ్బాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
నేడు జిల్లా మరియు స్థానిక సీపీఎం నాయకులు ఆ ప్రాంతం లో చేపట్టిన నిరసనకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడిచిన కొద్ది కాలం లోనే 4 దఫాలు ఈ నాలా పై వేసిన స్లాబ్‌ లు కూళిపోయాయని వాహనాలు నాలాలో పడిపోయాయని ప్రాణాపాయం తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం దీనికి కారణంగా సీపీఎం ప్రాథమిక పరిశీలనలో తెలిసిందని చెప్పారు. తక్షణం జి హెచ్‌ ఎం సి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్‌ చేశారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న మిగతా పనుల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారుల,కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల గోషా మహల్‌ మెయిన్‌ రోడ్‌ నాలా ప్రక్క రోడ్డంతా కుంగిపోవడం వల్ల వేలాది వాహన దారుల వాహనాలు దారి మళ్లించారు.దీనివల్ల ప్రజలు అవస్థల పాలవుతున్నారని ఆయన ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఎప్పుడు మతపరమైన అల్లర్లు సృష్టించే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏమి చేస్తున్నాడని ఎం డి అబ్బాస్‌ ప్రశ్నించారు.
ఈ నిరసన లో సీపీఎం గోషామహల్‌ జోన్‌ కన్వీనర్‌ పి.నాగేశ్వర్‌, జిల్లా,జోన్‌ నాయకులు కే.జంగయ్య,ఎం బాలు,ఎం మీనా,ఎం శ్రావణ్‌,నెమ్మది గోపాల్‌,ఎం డి అయూబ్‌ ఖాన్‌,కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking