మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

 

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కలెక్టర్ ఆశీష్సంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ
సందర్బంగా కలెక్టర్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ముఖ్యమైనదని,జిల్లా ఎస్పీ గా మహిళ ఉండటం గొప్ప విషయమని తెలిపారు. ఓటు హక్కు కల్పించిన తర్వాత మహిళల పురోగతి ప్రారంభం అయ్యిందని, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకావాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అని అంబేద్కర్ మాటలను గుర్తుచేశారు. మహిళలను గౌరవించాలని, మహిళాసాధికారతకు ప్రతిఒక్కరు కృషిచేయాలనీ అన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మహిళలతో కేకు ను కట్ చేయించారు. అనంతరం పోషణ పక్షం పోస్టర్ ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈనెలలో స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు,మెహిందీ పోటీలలో గెలుపొందిన మహిళలను కలెక్టర్ సన్మానించి, బహుమతులు అందజేశారు.
అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్ధినీలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్,డీ.ఆర్డీ.వో విజయలక్ష్మి, డీ.డబ్లూ.వో రమేష్, సిపిఓ మల్లికార్జున్, ఎల్.డీ.ఎం చంద్రశేఖర్, సీ.డీ.పీ.వో లు,అధికారులు, మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking