పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్ రోడ్ షో లో పాల్గొన్న మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు.
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ లో స్థానిక అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బిజీవైఎం జిల్లా అధ్యక్షులు జానకిరామ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రోడ్ షో లో పాల్గొన్న మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు రఘునందన్ రావు కామెంట్స్
– బీజేపీ అధికారంలోకి వస్తే పేదరికం, నిరుద్యోగం తగ్గించేందుకు, రైతులు, మహిళల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటాం.
– కేసీఆర్ పెద్ద కొడుకు అని నమ్మి పదేళ్ళు అధికారము ఇస్తే ఏంచేసిండు?- తూప్రాన్ లో తిరుగుతుంటే వినతి పత్రాలు ఇస్తున్నారు. కనీసం ఆడపిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయలేదు. సిద్దిపేట కు అన్ని మంజూరు చేసుకున్న హరీష్ రావు పదేళ్ళు అధికారంలో ఉండి కూడా తూప్రాన్ కు ఒక్క డిగ్రీ కళాశాల మంజూరు చేయించలేదు.- ఇగ చిన్న కొడుకు రేవంత్ రెడ్డి వచ్చిండు. రూ. 4 వేల పెన్షన్ ఇస్తున్నడు ఏమైంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తారీఖున రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తున్నడు. ఏమైంది నీ రుణమాఫీ రేవంత్ రెడ్డి.
– రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 నెలలవుతుంది. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 లు ఇస్తన్నడు, ఇచ్చిండా.
– కాంగ్రెసోళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అని పెట్టిర్రు. వట్టిగా తిరిగి ఏంజేస్తరు? ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టుడు తప్ప.

– రాజ్ పుష్ప కంపెనీ పేరుతో రూ.100 కోట్ల కు ఏకరా చొప్పున వెయ్యి కోట్లు పెట్టి పదెకరాలు కొనుగోలు చేసిన వెంకట్రామిరెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివి?
– నేను ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, డబ్బులు ఎలా పంచుతానని వెంకట్రామిరెడ్డి అంటుండు, కానీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిండు అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచినమని.
– బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడనా? లేక చర్యలు తీసుకోకుండా, కొత్త ప్రభాకర్ రెడ్డి రాయభారం నడిపీస్తుండా?
– రూ.14 కోట్లకు భూమి అమ్మిన అని చెప్పి కాగితం రాయించుకుని, రూ.14 కోట్లు బలవంతంగా గుంజుకుంది కవిత అని సీబీఐ దగ్గర కవిత ఒప్పుకుంది అని పేపర్లలో వచ్చింది.- ఇక్కడ శరత్ చంద్రారెడ్డి పిలుస్తలేరు, వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తలేరు,కవితపై కేసు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయకుండా కుట్రలు పన్నుతున్నారు నేను మళ్ళీ చెబుతున్న వెంకట్రామిరెడ్డి గారు ఇవ్వన్నీ నేను చెప్పట్లేదు అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిండు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.