బాలు ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వినర్
సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సికింద్రాబాద్ జిల్లాలో
ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం బడులు మొదలయి ఆరు నెలలు గడుస్తున్న కానీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మరియు పాఠ్య పుస్తకాలు లేకపోవడం సిగ్గుచేటు.
తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసింది. అందుకని తెలంగాణలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అందరం ఆశించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్న ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యా సమస్యలపై ఎలాంటి మాట లేదు టిఆర్‌ఎస్ చేసిన నియంత పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నారు.
ప్రవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో అక్రమంగా లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. సికింద్రాబాద్ పరిధిలో ఉన్న ఎస్సార్ నగర్ అమీర్పేట్ అల్వాల్ ప్యారడైజ్ బేగంపేట్ మారేడుపల్లి లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వం నిబంధనకు వ్యతిరేకంగా స్కూళ్లల్లో బుక్స్ కానీ యూనిఫామ్ అధిక రేట్లతో అమ్ముతున్న యజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం 2009 విద్యా హక్కు చట్టం కఠినంగా అమలు చేయాలి.
ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు కార్పోరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లు నడపాలి. నిబంధనలకు వ్యతిరేకంగా బుక్స్ గాని యూనిఫామ్ స్కూల్లో అమ్మితే స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఏబీవీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాను.
ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే డిఈవో, ఎంఈఓ అధికారులు నియమించాలి. ప్రభుత్వం స్కూల్ లలో పెడుతున్న మధ్యాహ్నం భోజనంలో జరుగుతున్న అవకతోకలపై విచారణ జరిపిన నాన్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. మరియు నాణ్యమైన ఆహారం అందించాలి.
మెగా డీఎస్సీ ద్వారా 24 వెయిలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్క్యావెంజర్లను నియమించాలి.
విద్యా హక్కు చట్టంలి ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి
ప్రతి స్కూళ్లలో కచ్చితంగా ఫైర్ సేఫ్టీ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ స్పోర్ట్స్ సామాగ్రి ప్లే గ్రౌండ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రవేటు కార్పోరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో తనిఖీలు చేయించి ప్రతి సమస్య పరిష్కరించాలని భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తుంది లేని యెడల ఏబీవీపీ ఆధ్వర్యంలో మరో ఉద్యమం చేయడానికి ఏబీవీపీ సిద్దమని ఈ ప్రభుత్వాన్ని ప్రైవేటు కార్పోరేట్ ఇంటర్నేషనల్ హెచ్చరిస్తున్న
Prev Post