మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

 

పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారులకు రేపు ఇళ్ల కేటాయింపు

ఇళ్ల పత్రాలను అందజేయనున్న మంత్రి హరీష్ రావు

…..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, సెప్టెంబర్01: ప్రజ బలం ప్రతినిది:
పటాన్చెరు నియోజకవర్గం కొల్లూర్-1 ప్రాజెక్టులో మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు రేపు(02.09.23) మంత్రి హరీష్ రావు ఇండ్లను కేటాయించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు నేపథ్యంలో మంత్రి విచ్చేయనున్న సందర్భంగా అదనపు కలెక్టర్లు, జిహెచ్ఎంసి అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై కొల్లూర్ – 1 గృహ సముదాయం లో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 3500 మంది లబ్ధిదారులకు రాండనైజేషన్ పద్ధతిలో ఇండ్లను కేటాయించి, ఇంటి పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.ఏలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లను సవ్యంగా చేయాలన్నారు.
అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గం కర్దనూర్ -II ప్రాజెక్టులో 500 మంది లబ్ధిదారులకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు.
ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు, జిల్లా అధికారులు కోఆర్డినేషన్తో చేయాలన్నారు.
డయాస్, సీటింగ్ అరేంజ్మెంట్, త్రాగునీరు, ఫుడ్ అరేంజ్మెంట్ తదితరాలను ఆయా అధికారులు పూర్తి బాధ్యతగా చేయాలన్నారు. లబ్ధిదారులను సభా స్థలికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అంతరాయం లేకుండావిద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, కళాజాత కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో,మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని వైద్యఆరోగ్య సిబ్బందికి సూచించారు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ఆయా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అంతకుముందు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు వెంకటేష్, స్నేహ లతో కలిసి కొల్లూర్ – 1 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని, కార్యక్రమ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో
డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, డిపిఓ సురేష్ మోహన్,
ఏ పిడి జయదేవ్ ,డిసిఓ ప్రసాద్ ,మెప్మా పీడీ గీత, డిప్యూటీ కలెక్టర్లు రాధా బాయ్, మహిపాల్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, సంబంధిత తహసీల్దారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking