పదవ తరగతి టాపర్ ను సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు.

శాలువాతో ఘనంగా సన్మానించిన న్యాయవాదులు.

వేములవాడ టౌన్,( ప్రజాబలం ), తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రోజున వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను అత్యధికంగా 585 మార్కులు సాధించిన వేములవాడ బార్ అసోసియేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కనికరపు శ్రీనివాస్ కుమారుడు, కనికరపు జీవన్ ను వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ హాల్లో న్యాయవాదులు కనికరపు జీవన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రవి, ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, నాగుల సత్యనారాయణ, పొత్తూరు అనిల్ కుమార్, గుడిసె సదానందం, కముటం అంజయ్య, భోగి కార్ శ్రీనివాస్, పెంట రాజు, నక్క దివాకర్, బొజ్జ నరేష్, గుజ్జె మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking