క్రీడల ద్వారా శారీరక ఎదుగుదల
యువత చెడు మార్గాల వైపు వెళ్లొద్దు
లక్షెట్టిపేట సీఐ అల్లo నరేందర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 17 : నేటి యువత క్రీడల ద్వారా శారీరకంగా,మానసికంగా ఎదుగుతారని,చెడు మార్గాల వైపు వెళ్లి జీవితాలు పాడు చేసుకోవద్దని లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ సూచించారు. సోమవారం అయన మండలంలోని వెంకట్రావుపేట యువకులకు క్రికెట్,వాలీబాల్, పుడ్ బాల్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… యువత సాంకేతిక విద్య ద్వారా ఎన్నో అవకాశాలు ఉంటాయని,వాటిలో నైపుణ్యం సాధించి అభివృద్ధిలోకి రావాలన్నారు.తల్లిదండ్రులు ఎంతో కస్టపడి తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారని,వారి కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్తే విజయం మీ సొంతమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రకుమార్,గ్రామ పోలీస్ అధికారి తిరుపతి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కోన కిష్టయ్య,పాయిలి చిన్నయ్య, వేణు,గొపల చారి,యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.