డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి జులై 24 (ప్రజాబలం) ఖమ్మం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జాబితాలో తమ పేరు ను తెలుసుకోవాలని, కామేపల్లి డిసిసిబి పరిధిలో 934 మంది రైతులకు రుణమాఫీ మంజూరు అయిందని, దీనికిగాను రెండు కోట్ల 43 లక్షల 780 రూపాయలు రైతు రుణమాఫీ జరిగిందని డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, కామేపల్లి సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం తెలిపారు. బుధవారం కామేపల్లి డిసిసిబి ని డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తో పాటు చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిందని, గిట్టుబాటు ధర లేక, అప్పులతో సతమతమయ్యారని, డిసిసిబి బ్యాంకులో పాస్ పుస్తకాలు తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను బలవంతంగా రికవరీ చేసిందని, కానీ మాట తప్పని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమం దేశంలోనే అతి గొప్ప రైతు కార్యక్రమంగా నిలిచిపోయిందని వారు అభివర్ణించారు. ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రైతు పక్షపాతిక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రామస్వామి, సొసైటీ సీఈవో నాగయ్య, బ్యాంక్ సిబ్బందిచైర్మన్ డైరెక్టర్ ను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమం లో బ్యాంకు సిబ్బందితోపాటు పుచ్చకాయల అప్పారావు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు
