మెదక్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి జాతీయ జాతీయ పతక ఆవిష్కరణ చేసిన మంత్రి శ్రీనివాస్ యాదవ్
మెదక్ 15-08-2023 ప్రజా బలం న్యూస్ :-
77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్యశాఖ, డెయిరీ అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకావిష్కరణలో కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ , జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి , జిల్లాకలెక్టర్ రాజర్షి షా , అదనపు కలెక్టర్లు రమేష్, వేంకటేశ్వర్లు,జిల్లా SP రోహిణి ప్రియదర్శిని, స్థానిక శాసన సభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి , నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ, నాయకులు కోటి పాల్గొన్నారు . అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి వందన సమర్పణ చేశారు .
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమo కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రసంగ పాఠం చదివి వివరించారు . స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ఔన్నత్యాన్ని దేశపౌరులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి సన్మానించారు . సిద్దార్థ్ మోడల్ హై స్కూల్ , TSWRS స్కూల్ , గీత హై స్కూల్ విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంసృతిక తిలకించి , విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు . కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఫిక్స్ డిపాజిట్ రూపంలో బాండ్స్ ను అందజేశారు . మత్యకారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. గ్రౌండ్ లో వివిధ శాఖలు ఏర్పాటుచేసిన అభివృద్ధి పధకాల స్టాల్స్ లను తిలకించారు . పశుసంవర్ధక శాఖ, ఆధ్వర్యంలో 6 యూనిట్స్ లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు , మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు , అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.