ప్రతిపక్షాలకు తలసాని పిలుపు
కంటోన్మెంట్ లో లాస్య నందితకు మద్దతు తెలపాలని విపక్ష పార్టీలకు మంత్రి తలసాని పిలుపునిచ్చారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ భారాస పార్టీ ముఖ్య నాయకులతో తలసాని ఆదివారం సమావేశమయ్యారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి కి సాయం అందించిన గొప్ప వ్యక్తి సాయన్న అని ఆయన అన్నారు.
కంటోన్మెంట్ లో సాయన్న కుమార్తె లాస్య భారీ మెజార్టీ తో గెలుపు ఖాయమన్నారు.
తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు.
ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు తలసాని కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలలో పోటీ చేసే విషయాన్ని ఒకసారి విపక్ష పార్టీలు ఆలోచించాలన్నారు.